పొదలకూరు: చంద్రబాబు రైతు ద్రోహి – కాకాణి గోవర్ధన్ రెడ్డి

304చూసినవారు
పొదలకూరు: చంద్రబాబు రైతు ద్రోహి – కాకాణి గోవర్ధన్ రెడ్డి
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రైతులను మోసం చేశారని, ఆయన పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు. శనివారం పొదలకూరు మండలంలోని సూరాయపాలెం, మహమ్మదాపురం గ్రామాల్లో పర్యటించిన ఆయన, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్