నెల్లూరు నగరంలోని 53, 54వ డివిజన్లలో మంత్రి నారాయణ మంగళవారం పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతలు అమరావతిపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమని చెప్పిన జగన్, అధికారంలోకి రాగానే మాట తప్పి 'మూడు ముక్కలాట' ఆడారని, భూములిచ్చిన రైతులను కంచెలేసి బంధించి మహిళలపై బూటు కాళ్లతో దౌర్జన్యం చేయించారని ధ్వజమెత్తారు.