కార్పొరేషన్ పరిధిలో పల్స్ పోలియో విజయవంతం

716చూసినవారు
కార్పొరేషన్ పరిధిలో పల్స్ పోలియో విజయవంతం
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25 కేంద్రాలలో, ముఖ్యంగా రొట్టెల పండుగ జరిగే బారా షహిద్ దర్గా పరిసరాల్లోని 4 పాయింట్లలో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. సున్నా నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ ఈ చుక్కలు వేశారు. సిహెచ్ఓ జ్యోతి, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఉమామహేశ్వరి, అర్బన్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ జిజియా బాయి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు కూడా వ్యాక్సిన్ అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్