ఎస్జీటీలకు పదోన్నతులు తగ్గించడం సరికాదు: ఫూలే టీచర్స్ ఫెడరేషన్

161చూసినవారు
ఎస్జీటీలకు పదోన్నతులు తగ్గించడం సరికాదు: ఫూలే టీచర్స్ ఫెడరేషన్
ఎస్జీటీ ఉపాధ్యాయులకు తెలుగు, హిందీ స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతుల్లో 70 శాతం కల్పించాలని, దానిని 30 శాతానికి తగ్గించడం సమంజసం కాదని ఫూలే టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ నెల్లూరులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ కాలంగా పదోన్నతులు లేకుండా ఎదురుచూస్తున్న ఎస్జీటీలకు ఉన్న అవకాశాలను తగ్గించడం సరైన విధానం కాదని, ప్రతి సబ్జెక్టుకు 70:30 నిష్పత్తిలోనే పదోన్నతులు, నియామకాలు అమలు చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్