నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రేపు నెల్లూరుకు చేరుకోనున్నారు. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనారోగ్య కారణాలవల్ల కాలి చికిత్స నిమిత్తం ఆయన గత నెల రోజులుగా కేరళలో చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం ఆయన రేపు నెల్లూరుకు చేరుకుని, యధావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటారు.