కాశీ యాత్రకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన లక్ష్మమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మరణించిన విషయం భర్త వెంకటేశ్వర్లుకు చెప్పకుండా, వేరే ఆస్పత్రిలో ఉందని చెప్పి లక్ష్మమ్మ మృతదేహంతో పాటు గాయపడిన వెంకటేశ్వర్లును అంబులెన్సులో పాట్నా నుంచి సుమారు 2600 కి.మీ. ప్రయాణించి సంగం తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భార్య మృతి విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు తీవ్రంగా రోధించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.