నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుకాల ఉద్యాపన పూజలో పాల్గొన్న భక్తులు అమ్మవారికి చీర, జాకెట్టు, 108 నిమ్మకాయల మాలలను సమర్పించారు. అనంతరం మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.