నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని వార్డు సచివాలయ ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు - 2026 ను బుధవారం నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వై. ఓ నందన్, నారాయణ జిఎం విజయ్ భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సచివాలయ ఉద్యోగులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఏ. సి సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో రెండు రోజులపాటు వార్డ్ సచివాలయ కార్యదర్శులకు "సింహపురి గ్రామ వార్డు సచివాలయ జాయింట్ యాక్షన్ కమిటీ" ఆధ్వర్యంలో పురుషులు, మహిళలకు వివిధ విభాగాలలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి.