నెల్లూరులో విజయవంతంగా కార్యకర్తల సమావేశం

1892చూసినవారు
నెల్లూరులో విజయవంతంగా కార్యకర్తల సమావేశం
నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ (పురమందిరం)లో మంగళవారం జనసేన పార్టీ నెల్లూరు పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమాచార సేకరణ కమిటీ మరియు జనసేన కార్యకర్తల సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి బొమ్మిడి నాయకర్ (ఎమ్మెల్యే, చీఫ్ విప్, సాధక్ కమిటీ చైర్మన్ – ఆంధ్రప్రదేశ్) ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో వివిధ విభాగాల్లో సేవలందించేందుకు ఆసక్తి ఉన్న నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్