నెల్లూరు నగరపాలక సంస్థ పౌర సేవల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ISO) మూడు విభాగాలలో ఉత్తమ ప్రతిభ సర్టిఫికెట్లను ప్రధానం చేసింది. ఈ గౌరవం ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు, నగర ప్రజల సమిష్టి కృషి ఫలితమని కమిషనర్ వై. ఓ నందన్ శుక్రవారం ఒక వీడియో ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకోవడం సంస్థకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.