భార్యను చంపిన భర్త

1578చూసినవారు
భార్యను చంపిన భర్త
నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ సమీపంలో శనివారం ఒక దారుణం జరిగింది. పదేళ్ల క్రితం వివాహం చేసుకున్న నందిని, తొమ్మిది నెలలుగా భర్తకు దూరంగా బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. శనివారం ఉదయం బెంగళూరు నుంచి నెల్లూరుకు వచ్చిన ఆమె, మెడికవర్ హాస్పిటల్ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా భర్త అడ్డుకున్నాడు. వారిద్దరి మధ్య జరిగిన గొడవలో, భర్త కత్తితో పొడవడంతో నందిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్