ల్యాండ్ రెగ్యులైజేషన్ స్క్రీం ను విజయవంతం చేయాలి

152చూసినవారు
ల్యాండ్ రెగ్యులైజేషన్ స్క్రీం ను విజయవంతం చేయాలి
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ల్యాండ్ రెగ్యులైజేషన్ స్క్రీంను విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్రమ లేఅవుట్లు, అనధికారిక భూములను చట్టబద్ధం చేయడానికి ఇది ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు, కందుకూరు, ఆత్మకూరు, కావలి మున్సిపల్ కమిషనర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఈ విషయంపై చర్చించారు. వైస్ చైర్మన్ మొగలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఈ పిలుపు వెలువడింది.

సంబంధిత పోస్ట్