ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రొట్టెల పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది నెల్లూరు నగరానికి తరలివచ్చారు. దీంతో నగరం మొత్తం జన సందోహంతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా దర్గా ప్రాంతానికి వెళ్లే బ్రహ్మానందపురం అంబేద్కర్ నగర్ రహదారిపై ప్రజలు భారీగా గుమిగూడటంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది.