సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్త్

132చూసినవారు
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్త్
ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామంలోని జాగీరు వనంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఆదివారం డీపీవో కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు అధికారులతో బందోబస్త్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వీవీఐపీ హెలికాప్టర్ ల్యాండింగ్ నుండి టేక్ ఆఫ్ వరకు ప్రతి అధికారి తనకు కేటాయించిన సెక్టార్‌లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లాలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేయబడింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you