నెల్లూరు ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది, 20 మందికి పైగా గాయపడ్డారు

521చూసినవారు
నెల్లూరు ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది, 20 మందికి పైగా గాయపడ్డారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్ణాటకలోని చింతామణి వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. పామూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడగా, పది మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్