గాంధీ విగ్రహానికి SGSW ఉద్యోగుల సమస్యలపై ఐక్యవేదిక వినతి

0చూసినవారు
గాంధీ విగ్రహానికి SGSW ఉద్యోగుల సమస్యలపై ఐక్యవేదిక వినతి
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి SGSW ఉద్యోగులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఐక్యవేదిక తరపున వినతిపత్రాన్ని సమర్పించారు. SGSW ఉద్యోగులకు ఉన్న అదనపు పనిభారం, డిప్యూటేషన్లు రద్దు, పదోన్నతులు, నొషనల్ ఇంక్రిమెంట్లు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈకార్యక్రమంలో UWGEA రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జల రాజ్యలక్ష్మి, UWGEA జిల్లా అధ్యక్షుడు వెందోటి శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లోకేష్, ఐక్యవేదిక ప్రతినిధులు బాలు, చైతన్య, సుమన్, మురళి కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్