మత్స్యకారులకు అన్యాయం జరిగితే సహించం: కాకాణి

329చూసినవారు
మత్స్యకారులకు అన్యాయం జరిగితే సహించం: కాకాణి
మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదివారం నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యం వలనే మత్స్యకారుల బోట్లు తరలి వెళ్ళాయని, మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్న నాలుగు బోట్లను అధికారులు, నాయకులు కుమ్మక్కై వదిలేశారని మండిపడ్డారు. బోట్లు తరలి వెళ్లడంపై బిఎంఆర్ పేరు తాము చెప్పలేదని, ఇస్కపల్లి కాపు తోటయ్య తన వాంగ్మూలంలో 10 లక్షల రూపాయల లెక్కన డబ్బులు ఇస్తామని, బోట్లు వదిలివేయమని చెప్పారన్నారు. మత్స్యకారులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్