ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆంధ్రజ్యోతి దినపత్రికలను తగులబెట్టారు.