జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు జరగనుంది. సీఈఓ శ్రీధర్రెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్ష జరగనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరవుతారని, పలు ప్రజా సమస్యలపై ప్రతినిధులు చర్చించనున్నారని తెలిపారు.