
నెల్లూరు: ఖాళీ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ మంగళవారం రెవిన్యూ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయ పరిధిలో కొత్తగా నిర్మించిన భవనాలు, అదనపు అంతస్తులు, అపార్ట్మెంట్లు, భవన వినియోగంలో మార్పులు, ఖాళీ స్థలాలను గుర్తించి, వాటికి పన్నులు విధించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఈ సమీక్ష వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా జరిగింది.





































