
నెల్లూరు: టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం
నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్చార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గురువారం టౌన్ ప్లానింగ్ విభాగంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, ఎల్.ఆర్.ఎస్. మరియు బి.పి.ఎస్. అప్లికేషన్లపై సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచడానికి, వాటర్ టాక్స్, బిల్డింగ్ ప్లాన్ ఫీజులు, ఎల్.ఆర్.ఎస్., బి.పి.ఎస్. ద్వారా రాబడిని పెంచుకోవాలని అధికారులకు సూచించారు. సానుకూల దృక్పథంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.








































