
సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు స్వీకరించి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యల పరిష్కారంలో నిబంధనలకు లోబడి మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డి ఆర్ ఓ విజయ్ కుమార్, డిపిఓ వసుమతి, జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






































