కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 106 సంవత్సరాలుగా కృషి చేస్తున్న ఏకైక సంస్థ ఏఐటీయూసీ అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటసుబ్బయ్య అన్నారు. బుధవారం నెల్లూరులోని రామకోటయ్య భవన్‌లో జరిగిన ఏఐటీయూసీ నెల్లూరు జిల్లా 15వ మహాసభలో ఆయన మాట్లాడుతూ, కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మికుల హక్కులను, చట్టాలను కాలరాస్తోందని విమర్శించారు.