బారా షహీద్ దర్గా గంగా మహోత్సవాలకు అమీన్ పీర్ పీఠాధిపతి రాక

1350చూసినవారు
నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో జరుగుతున్న గంగా మహోత్సవాల సందర్భంగా, కడపలోని ప్రసిద్ధ అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ అరిపుల్ల మాలిక్ హుస్సేనీ శనివారం రాత్రి దర్గాను సందర్శించారు. దర్గా నిర్వాహకులు, మత పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికి, దర్గా ప్రాంగణంలో ప్రార్థనలు నిర్వహించి, ఉత్సవాల విజయవంతం కోసం దువా చేశారు. ఆయన రాకతో దర్గా ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెరిగింది.

సంబంధిత పోస్ట్