ప్రకాశం జిల్లా పామూరు మండలం పోతారం గ్రామంలో పట్టపగలే జరిగిన చైన్ స్నాచింగ్ సంఘటన శనివారం కలకలం రేపింది. ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని పారిపోతున్న దొంగను గ్రామస్తులు చాకచక్యంగా వెంబడించి పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు వరికుంటపాడు మండలం వేంపాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గ్రామస్తుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.