బడికి వెళ్లాల్సిన పిల్లలు భిక్షాటన: అధికారులు స్పందించాలి

377చూసినవారు
బడికి వెళ్లాల్సిన పిల్లలు భిక్షాటన: అధికారులు స్పందించాలి
పాఠశాలలు పునఃప్రారంభమైన వేళ ఉదయగిరిలో బాలలు భిక్షాటన చేస్తూ కనిపించడం కలచివేసింది. బడిబాట పట్టాల్సిన చిన్నారులు వీధుల్లో యాచించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి చిన్నారి విద్యను పొందాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు ఇటువంటి దృశ్యాలు సవాల్‌గా మారుతున్నాయి. అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి భిక్షాటనలో ఉన్న బాలలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడంతో పాటు వారి కుటుంబాలకు సాయం అందించాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్