గురువారం నెల్లూరులోని ముత్తుకూరు గేట్ సెంటర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ను పునరుద్ధరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ, కృష్ణపట్నం పోర్టును ఆదాని యాజమాన్యం స్వాధీనం చేసుకున్న తర్వాత కంటైనర్ టర్మినల్ ను మూసివేసినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదానీ కంపెనీకి అక్రమంగా భూములు కేటాయించడం ఆపాలని, కంటైనర్ టర్మినల్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రసాద్, నగర కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.