సీపీఐ నెల్లూరు జిల్లా మాజీ కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ ప్రభాకర్ ఆదివారం అనారోగ్యంతో నెల్లూరులోని నారాయణ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రైతు, కార్మిక సమస్యల పరిష్కారం కోసం దశాబ్దాలుగా పోరాడిన ఆయన మృతి పట్ల రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.