మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి, దానిని నిర్వీర్యం చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. శుక్రవారం నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ గాంధీ నగర్ పార్కులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, రూరల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.