నెల్లూరు జిల్లా జనసేనలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కొత్త నాయకులను నియమించేందుకు పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మంగళవారం నెల్లూరు చేరుకున్న జిల్లా అబ్జర్వర్ నేత
జనసేన ముఖ్య నేతలతో నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతం, మండల స్థాయి కమిటీల ఏర్పాటు, బూత్ స్థాయి నిర్వహణపై సమగ్రంగా చర్చించారు. త్వరలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బాధ్యతాయుత నాయకులను ప్రకటించనున్నట్లు సమాచారం.