నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి

4చూసినవారు
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
నెల్లూరు జిల్లా కోట మండలం చంద్రశేఖరపురం వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. అతివేగంతో దూసుకువచ్చిన ఓ ప్రైవేటు బస్సు ఆటో, బైక్‌ను ఢీకొని దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కేశవరం గ్రామానికి చెందిన శివ (22), వాజివాకకు చెందిన వినోద్ (21) అక్కడికక్కడే మృతిచెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.