పొట్టే పాలెం కలుజు పై బ్రిడ్జిని ప్రారంభించిన కోటంరెడ్డి

0చూసినవారు
పొట్టే పాలెం కలుజు పై బ్రిడ్జిని ప్రారంభించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టే పాలెం కలుజు పై బ్రిడ్జి ని శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, tdp రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ 6 కోట్ల 54 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ఈ బ్రిడ్జి వలన ఐదు నియోజకవర్గాల ప్రజల సమస్యకు శాశ్విత పరిష్కారం లభించిందన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి జిల్లా కలెక్టర్ సహకారం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్