నెల్లూరు,: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు

232చూసినవారు
నెల్లూరు,: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు
కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్పు చేస్తూ తీసుకువచ్చిన 'వికసిత్ భారత్ విరాంజీ' చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అక్కచెరువుపాడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. సంజీవని లాంటి ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం పేదల కడుపు కొట్టడమేనని జిల్లా కన్వీనర్ కె. వినోదమ్మ విమర్శించారు. ప్రతి పేదవానికి ఏడాదికి 200 రోజులు పని కల్పించాలని, రోజువారీ వేతనాన్ని రూ 800కి పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్