ప్రకృతి వైపరీత్యాల నివారణకు మొక్కల పెంపకం అత్యవసరం

183చూసినవారు
ప్రకృతి వైపరీత్యాల నివారణకు మొక్కల పెంపకం అత్యవసరం
ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో మొక్కల పెంపకం కీలకమని స్మార్ట్ పూర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ షేక్ దస్తగిరి తెలిపారు. శనివారం నెల్లూరు రూరల్ మండలంలోని ములిముడి గ్రామంలో రిచా సంస్థ వ్యవస్థాపకులు జేసీ పంత్ ప్రధమ వర్ధంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆస్తి, మానవ, పశు సంపద నష్టపోతుందని, బలమైన గాలుల వల్ల ఇళ్లు కూలి నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని, చెట్లను నాటి సంరక్షించడం ద్వారా ఈ నష్టాలను నివారించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్