నెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగ విధుల్లో ఉద్రిక్తత నెలకొంది. విధి నిర్వహణలో ఉన్న నెల్లూరు రూరల్ తహసీల్దార్‌తో సీఐ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రెవెన్యూ సిబ్బంది నిరసన తెలిపారు. దర్గా ప్రధాన గేటు వద్ద బైఠాయించి, అధికారిపై అనుచితంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.