నెల్లూరు: 21 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్

54చూసినవారు
నెల్లూరు: 21 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రామారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు, జూలై 1న ఆప్షన్లలో మార్పులు, చేర్పులు, 3న సీట్ల కేటా యింపు ప్రక్రియ ఉంటుందని వివరించారు. నాలుగు నుంచి పదవ తరగతి స్టడీ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్