కోవూరు హైవేపై రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి

1912చూసినవారు
కోవూరు హైవేపై రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి
కోవూరు మండలం నేషనల్ హైవేపై ఆర్కే పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందిన వెంటనే కోవూరు పోలీసులు, హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్