ముగ్గురు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

6చూసినవారు
ముగ్గురు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) వసుమతి ముగ్గురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఆదివారం జారీ చేశారు. ముత్తుకూరు(M) నేలటూరు, ఈపూరు బిట్-1బీ, చిల్లకూరు(M) లింగవరం గ్రామ పంచాయతీ కార్యదర్శులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నిధుల వినియోగంలో అవకతవకలపై సమగ్ర విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you