
కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాద హెచ్చరిక జారీ
సోమవారం సాయంత్రం 'మెంథా' తుఫాన్ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాను 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 5, 6వ నంబరు ప్రమాదకర సూచికలుగా పరిగణిస్తారు, ఇది గాలులు, అలలు పోర్ట్ పరిసరాల్లో ప్రభావం చూపుతాయని సూచిస్తుంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో పోర్టులో కార్యకలాపాలన్నీ నిలిపివేస్తారు. అయితే, కార్మికులకు సెలవులు ఇవ్వకపోవడంపై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు.






































