మనుబోలు మండలంలోని కోదండరామపురం స్మశానానికి మహర్దశ పట్టింది. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామస్తులు అభివృద్ధి పనులను చేపట్టారు. గతంలో ఆక్రమణలకు గురై, మృతదేహాల దహనం లేదా ఖననానికి ఇబ్బందికరంగా మారిన స్మశానాన్ని అధునాతనంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామస్తుల సహకారంతో స్మశానంలో మెరుగైన వసతులను కల్పించనున్నట్లు తెలిపారు.