అమరావతి స్కూల్ గ్రాడ్యుయేషన్ డే: విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేత

347చూసినవారు
అమరావతి స్కూల్ గ్రాడ్యుయేషన్ డే: విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేత
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలోని అమరావతి స్కూల్ నందు 2026, ఏప్రిల్ 9న లిటిల్ చాంప్స్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్లే క్లాస్ నుంచి 2వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డ్రెస్ లో పాల్గొని సర్టిఫికెట్లు, మెడల్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ కె. సురేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి విద్యార్థులను తదుపరి తరగతులకు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థ శ్రేయబిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్