అదుపు తప్పి ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

896చూసినవారు
అదుపు తప్పి ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
వలేటివారిపాలెం మండలం మాలకొండ ఘాట్ రోడ్డులో శనివారం స్వామివారి దర్శనం అనంతరం కొండ దిగుతూ వస్తున్న ఆటో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా సమీప ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్