సర్వేపల్లిలో 57 మందికి రూ. 75 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం

267చూసినవారు
సర్వేపల్లిలో 57 మందికి రూ. 75 లక్షల సీఎంఆర్‌ఎఫ్ సాయం
సర్వేపల్లి నియోజకవర్గంలో 57 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కింద రూ. 75 లక్షల ఆర్థిక సహాయం అందించారు. నెల్లూరులోని వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 760 మందికి రూ. 7. 22 కోట్ల సహాయం అందిందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదారంగా స్పందిస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా సుమారు రూ. 100 కోట్ల సాయం అందుతోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్