పొదలకూరు అమరావతి స్కూల్ లో ప్రముఖ మోటివేటర్ Dr. సురేష్ బాబు ఆదివారం విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని అధిగమించి ఉత్తమ ఫలితాలను ఎలా సాధించాలో వివరిస్తూ అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా అమరావతి స్కూల్ అధినేత సురేష్ గారు మాట్లాడుతూ, పిల్లల విజయానికి Dr. సురేష్ బాబు వంటి మోటివేటర్ల అవసరం ఎంతైనా ఉందని, వారి విజయానికి అవసరమైన ప్రతి ప్రయత్నం స్కూల్ చేస్తుందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయబిలాషులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.