బద్దెవోలు శివాలయంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి పూజలు

2180చూసినవారు
బద్దెవోలు శివాలయంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి పూజలు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం బద్దెవోలు గ్రామంలోని శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో సోమవారం, జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఏరువాక పూజలు ఘనంగా జరిగాయి. అర్చకులు సురేందర్ శర్మ ఆధ్వర్యంలో 1008 మట్టి శివలింగాలతో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన నిర్వహించారు. భక్తులు స్వయంగా అభిషేకం చేసి, అమ్మవారి కుంకుమ అలంకారాన్ని వీక్షించి తరించారు.

సంబంధిత పోస్ట్