బద్దెవోలులో ఘనంగా నిమజ్జనోత్సవం

1చూసినవారు
మనబోలు మండలం బద్దెవోలు బిసి కాలనీ సాయిబాబా గుడి దగ్గర గురువారం అర్ధరాత్రి వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. అర్చకులు సురేంద్ర శర్మ ప్రత్యేక పూజలు చేశారు. వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఊరేగించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా లడ్డు వేలం పాట నిర్వహించారు. లడ్డును చెరుకూరు శ్రీహరి రూ. 27వేలకు దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్