కన్నతల్లిని రోడ్డుపై వదిలేశాడు

314చూసినవారు
కన్నతల్లిని రోడ్డుపై వదిలేశాడు
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో కనిపెంచిన తల్లిని రోడ్డుపై వదిలేసిన ఘటన చోటుచేసుకుంది. ఈదలవారిపాలేనికి చెందిన వృద్ధురాలు మేకల లింగమ్మను ఆమె కుమారుడు ఆటోలో తీసుకెళ్లి పంటపాళెం రోడ్డుపై వదిలివేశాడు. ముత్తుకూరు పోలీసులు వృద్ధురాలిని గుర్తించి ఆమెను ఇంటికి చేర్చారు. అనంతరం కుమారుడికి తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్