జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చొరవతో, కాకినాడ హార్బర్ నుంచి నెల్లూరు జిల్లాకు మంగళవారం హైస్పీడ్ బోటును మత్స్యశాఖ అధికారులు తరలించారు. 326 హెచ్. పి సామర్థ్యం గల ఈ బోటు గంటకు 18 కి. మీ. వేగంతో నిరంతరం గస్తీ కాస్తూ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల మత్స్యకారుల అక్రమ వేటను అడ్డుకుంటోంది. వీడియో రికార్డింగ్ సౌకర్యం గల బైనాక్యూలర్లు, హెవీ ఫోక్స్ లైట్లతో తమిళనాడు మత్స్యకారుల కదలికలపై నిఘా ఉంచారు.