అమరావతి స్కూల్ లో ప్రశాంత వాతావరణంలో ఐఐటీ ఒలింపియాడ్ పరీక్ష

7చూసినవారు
అమరావతి స్కూల్ లో ప్రశాంత వాతావరణంలో ఐఐటీ ఒలింపియాడ్ పరీక్ష
పొదలకూరు మండలం అమరావతి స్కూల్‌లో సోమవారం ఐఐటీ ఒలింపియాడ్ పరీక్షల్లో భాగంగా 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు Cumulative Test (C. T-2), 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు Objective Unit Test (OUT-2) పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ కె. సురేశ్ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయడమే అమరావతి స్కూల్ లక్ష్యమన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయోగపడే ఇటువంటి పరీక్షలను నిర్వహించేందుకు సహకరిస్తున్న ఈ-అభ్యాస్ ఒలింపియాడ్ సంస్థకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్