కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అధినేత జగన్ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని సర్వేపల్లి జనసేన ఇన్ చార్జ్ సురేష్ నాయుడు మండిపడ్డారు. మనుబోలు మండలం గోవిందరాజు పురం లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ పాలనలో జరిగిన ఘోరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. వైసీపీ నేతలు తప్పు చేస్తున్నప్పటికీ జగన్ వారిని సమర్థించడం సిగ్గుచేటు అని విమర్శించారు.